17-05-2025 12:42:10 AM
కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి
కొత్తపల్లి, మే 16 (విజయ క్రాంతి): గతంలో వివిధ రకాల నేరాలకు పాల్పడి పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేరచరితులు సత్ప్రవర్తనతో మెదలాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. పరివర్తన చెందకుండా అదే పాత పద్ధతులను అనుసరిస్తూ వివిధ రకాల నేరాల్లో భాగస్వాములు అయినట్లయితే పిడి యాక్ట్ లను కూడా అమలు చేసి సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు శుక్రవారం సిఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, ప్రజలు ఇదేవిధంగా తమ వంతు సహకారాన్ని కొనసాగిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తో పాటుగా 25 మంది హిస్టరీ షీటర్లు పాల్గొన్నారు.