17-05-2025 12:46:18 AM
ఆర్మూర్ మే 16: (విజయ క్రాంతి):క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని విద్యార్థి సంఘా లు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన, వినతి పత్రం,పెం డింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ వి డుదల చేయాలని ఆర్మూర్ లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల నుండి ఎగ్జామ్ ఫీజు తీసుకొని వారికి పరీక్షలకు అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆర్మూర్ ఆర్డీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్,యూ ఎస్ ఎఫ్ ఐ డివిజన్ అధ్యక్షులు నాగరాజు, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక అనేక విధాలుగా నష్టపోతున్నారని, ప్రవేటు యజమాన్యాలు విద్యార్థులకు పరీక్షలు రాయనివ్వడం లేదని ఇందుకు కారణం ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడమే అని వారు తెలియజేశారు.
దాదాపు 5వేల కోట్ల పైచిలుక ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేస్తే వేలాది మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, వారి విద్య స్వేచ్ఛగా సాగుతుందని వారు తెలియజేశారు. అదేవిధంగా ఆర్మూర్ లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో వందలాదిమంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేని పరిస్థితిలో విద్యార్థులు లు ఉన్నారు
యజమాన్యం చేతులు ఎత్తేసి పరీక్షలు రాయనివ్వమని తేల్చేస్తారు దీని ద్వారా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు వారికి ఈ నెల 20 తేదీ వరకు చివరి అవకాశం ఉంది పరీక్ష ఫీజు కట్టడానికి ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ స్పందించి విద్యార్థి భవిష్యత్తు మీ చేతిలో ఉంది గనుక యజమాన్యంతో మాట్లాడాలని వారు తెలియజేసారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా మాటలు మానుకొని విద్యార్థులకు విడుదల చేయాలని వారు తెలియజేస్తారు . లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు యుఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.