18 May, 2026 | 3:42 PM

Breaking News

గరీబోళ్లకు అండగా ఇందిరమ్మ రాజ్యం

11-08-2025 12:55 AM

- ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నా చిన్నకొడుకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చింది

- మళ్లీ ఈనాడు నా పెద్ద కొడుకుకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చింది

-  ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సంతోషం

- అనాడైనా,ఈనాడైనా ఎప్పుడైనా పేద ప్రజలకు ఇందిరమ్మనే పెద్ద దిక్కు

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 10 (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ రాజ్యంలో తన చిన్న కొడుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరై అదే ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నారని, మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ , రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలోనే తన పెద్ద కొడుకుకు ఇందిరమ్మ ఇల్లు మంచిదైందని సంతోషం వ్యక్తంచేశారు.