11-08-2025 12:56:36 AM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): బీసీల ఓట్లతో పబ్బం కడుక్కోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ డ్రా మా ఆడుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జగిత్యాల బిఆర్‌ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వ కుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఈశ్వర్ మాట్లాడుతూ బీసీ లను న మ్మించి మోసం చేశారని మండిపడ్డారు.
42%రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని, కేంద్ర పరిధిలోని అంశం అని, 9వ షెడ్యూల్ లో చేరిస్తేనే అమలవుతుందని తెలిసినా కూడా బి సి ల ఓట్లు కొల్లాగొట్టడం కోసం శాసనస భ తీర్మానం, మంత్రి వర్గ సమావేశము, ఆర్డినేన్స్, గవర్నర్ దగ్గరకు పంపడం.. కేంద్రంకు పంపడం... లాంటి డ్రామాలు ఆడుతున్నార ని ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితిలో ఆమోదం ల భించదని అందరికీ తెలుసని అన్నారు. సీ ఎం, మంత్రులు అందరు ఢిల్లీ లో ధర్నా చే స్తూ మేము ప్రయత్నం చేసినం కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు...రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బి సి రిజర్వేషన్ సా ధిస్తాం అని చెప్పి స్థానిక సంస్థల్లో బీసీల ఓ టు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మం డిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ విషయంలో తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందని,బి సి రిజర్వేషన్ ఫై బి ఆర్ యస్ పార్టీ ఈ నెల 14న కరీంనగ ర్‌లో నిర్వహిస్తున్న సమావేశానికి కేటీఆర్ రా నున్నారని, జగిత్యాల జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్ళనున్నామని తెలిపారు.వర్షాలు లే క రిజర్వాయర్ల లో నీళ్లు అడగంటిన పరిస్థితి ఉందని, ఎస్సారెస్పీ లో 55 టీఎంసీ ల నీళ్లు మాత్రమే ఉన్నాయని,9,65,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ ము ఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించామని, రైతు బంధు, రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడుకల్వకుంట్ల విద్యాసాగర్ రా వు మాట్లాడుతూ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19నెలలు కావస్తుందని, అబద్దపు హామీలతో గద్దెనెక్కి.. బి సి రిజర్వేషన్ 42% సాధిస్తామని ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇందిరా గాంధీ కుటుంబాన్ని పొగడటం.. మోడీని తిట్టడం తప్ప ప్రజా స మస్యలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత బి ఆర్ యస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఓరుగంటి రమణ రావు,దావ సురేష్, జవ్వాజి ఆది రెడ్డి, హరీష్ కల్లూరి, అల్లాల రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు..