03-12-2025 12:00:00 AM
రాజాపూర్ డిసెంబర్ 2: విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం రాకుండా నిరంతరం విద్యుత్తు ఇవ్వాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బీమ్లా నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఇండ్లలో విద్యుత్ మీటర్లను పరిశీలించారు. మండలంలో గృహజ్యోతి విద్యుత్ మీటర్లు ఎన్ని ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జరగబోయే సర్పంచ్ ఎన్నికల పోలింగ్ బూతులలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిఈఈ చంద్రమౌళి ఏడిఈ నవీన్ కుమార్ ఏఈ వెంకటేష్ లైన్ ఇన్స్పెక్టర్ లు లైన్మెన్లు పాల్గొన్నారు.