3 April, 2026 | 2:47 AM

నీటి సంపులో పడి శిశువు మృతి

03-04-2026 12:45 AM

రాజేంద్ర నగర్ ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి 8 నెలల శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకా రం, రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలో తాసిల్దార్  కార్యాలయం సమీపంలో నివసిస్తున్న తేజస్ శ్రీకాంత్ జాధవ్ (22) అనే కూలీ, ఈ నెల 1న ఉదయం తన తల్లి ఉషా, సోదరుడు శంకర్తో కలిసి పనికి వెళ్లాడు. ఇంట్లో భార్య రాధికతో పాటు వారి 8 నెలల కుమారుడు సౌరభ్ జాధవ్ ఉన్నారు.

మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో శంకర్ ఇంటికి తిరిగి రాగా శిశువు కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు వెతకగా ఇంటి వద్ద ఉన్న నీటి సంపు మూత తెరిచి ఉండటం గమనించి సంపులో చూడగా శిశువు నీటి లో తేలుతూ కనిపించాడు. తక్షణమే శిశువును బయటకు తీసి రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి శిశువు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నార్సింగి ఎస్ హెచ్ ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు.