16 June, 2026 | 3:53 AM

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

16-06-2026 02:46 AM

బోయినపల్లి: జూన్ 15 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో సోమవారం ముగ్గురు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. బూరుగుపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి లత అనే బాధితురాలు క్యాన్సర్ తో బాధపడుతూ మంచం పట్టారు. ఈ తరుణంలో ఆమెను పరామర్శించి పరామర్శించి ప్రభుత్వం నుంచి వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహి సర్పంచ్ పెంచాల సత్తయ్య ఆరోగ్యానికి గురీ కాగా ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మరల పేట సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీరాజం, కొలుపుల ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలగోని వెంకటేష్  లున్నారు.