6 July, 2026 | 1:53 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

యాదాద్రికి భక్తుల తాకిడి

22-03-2026 12:59 AM
  1. ధర్మ దర్శనానికి మూడు గంటలు..
  2. స్పెషల్ దర్శనానికి రెండు గంటలు..

యాదగిరిగుట్ట, మార్చి 21 (విజయక్రాంతి): శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల రద్దీ పెరిగింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కొండ కింద రింగ్‌రోడ్డులో ఎటు చూసినా వాహనాలు కనిపించాయి. కొండపైన సైతం వాహన రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు వాహనాలను అనుమతించలేదు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.