8 April, 2026 | 3:32 PM

చిన్నారుల అభివృద్ధికై అక్షరాబ్యాసం, అన్నప్రాసన

08-04-2026 01:34 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రం-1లో చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం అక్షరాభ్యాసం మూడు నుండి ఆరు ఏళ్ల పిల్లలకు మరియు అన్నప్రాసన ఆరు  నెలల చిన్నారులకు కార్యక్రమాలు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం, సరైన పోషకాహారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్న వయస్సులోనే విద్యపై ఆసక్తి పెంపొందించడంలో అక్షరాభ్యాసం ముఖ్యపాత్ర పోషిస్తుందని, అలాగే అన్నప్రాసన ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పాటు లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ ఎం. రాధ, ఉప సర్పంచ్ సోమరెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, కదుర్క లక్ష్మి-రాజేందర్, అల్లె లత, అరికుప్పల రాజం, శనిగారపు నరేష్, ఎం.డి షబ్బీర్, ఎనుగంటి నరేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.