రజిత వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తె మట్టెలు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో పాడిరైతు పల్లె లక్ష్మరెడ్డి – కళల కూతురు రజిత వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేసింది. ఈ సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి వధూవరులకు పుస్తెమట్టెలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ‘కళ్యాణమస్తు’ పథకం ద్వారా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిపల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు సింగిరెడ్డి మాధవరెడ్డి, డైరెక్టర్లు రాగులు రాజిరెడ్డి, ఏలేటి విజయ్ రెడ్డి, తొంటీ రాజయ్య, పల్లె లక్ష్మరెడ్డి, గొట్టిపర్తి రాజు, సుంకపక దేవయ్య, పోచంపెల్లి రంగయ్య, బీమరి రాములు, సెక్రటరీ ఐరెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




