calender_icon.png 18 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి అంత్యక్రియలకు ఇన్నయ్య

18-01-2026 01:01:03 AM

పెరోల్‌పై వచ్చి నివాళి

మహబూబాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ అంత్యక్రియలు శనివారం జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో నిర్వహించారు. తల్లి కడసారి చూపు కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇన్నయ్య ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పెరోల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు 48 గంటల పాటు పెరోల్ మంజూరు చేసింది. పోలీసు బందోబస్తు మధ్య ఇన్నయ్య సాగరం వచ్చి తల్లి మృతదేహం వద్ద నివాళులర్పించి, అంత్యక్రియలు నిర్వహించారు.