calender_icon.png 18 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండను సూపర్ స్మార్ట్‌గా తీర్చుతా

18-01-2026 01:02:32 AM

రూ.2 వేల కోట్లు తెచ్చేందుకు సిద్ధం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్, జనవరి 17: నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.18.7 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణాభివృద్ధికి ఇప్పటివరకు రెండువేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అమృత్-2 కింద రూ.216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నూతన ఎస్ టి పి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రూ.56 కోట్ల 75 లక్షలతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్తగా 12 ట్యాంకులు, తాగునీటి పైప్లైన్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని, మరో రూ.53 కోట్ల టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

109 కోట్ల రూపాయల ఎస్ డిఎఫ్ నిధులతో వరద కాలువల నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి పనులు, అంతర్గత రహదారుల పనులు కొనసాగుతున్నాయన్నారు. 24 గంటలు నల్లగొండలో కృష్ణా నీటిని సరఫరా చేసేందుకు రూ.125 కోట్ల డిపిఆర్‌తో ప్రభు త్వ మంజూరుకు పంపించామని, రూ.140 కోట్ల రూపాయలతో లతీఫ్ సాహెబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్  పనులు కొనసాగుతున్నాయన్నారు. నల్లగొండ ము న్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినందున కేంద్రం ద్వారా నేరుగా నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని, అందువల్ల పట్టణ ప్రజ లు సామరస్యంతో పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

హైదరాబాద్‌కు స మాంతరంగా నల్లగొండ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ బి చంద్రశేఖర్, అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, ఆర్డిఓ వై.అశోక్‌రెడ్డి, ప్రజారోగ్య సంస్థ సూపరింటిండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ ము న్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్, తహసిల్దార్ పరుశురాం పాల్గొన్నారు.