calender_icon.png 9 January, 2026 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలమంచి తండా సర్పంచ్ వినూత్న ఆలోచన

07-01-2026 12:00:00 AM

ఇందిరమ్మ చీరల విశిష్టతను చాటిచెప్పిన సర్పంచ్ బద్రునాయక్

మరిపెడ జనవరి 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకానికి ఉన్న విశిష్టతను చెప్పేందుకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా సర్పంచ్ బానోతు బద్రునాయక్ ఆధ్వర్యంలో 200 మంది మహిళలు యాద గిరిగుట్ట, స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అందిస్తున్న ఈ అందమైన చీరలను ధరించి, ఒకే రకమైన వేషధారణలో మహిళలు ఐక్యంగా స్వామి వారిని సందర్శించడం అందరినీ ఆకట్టుకుంది.

ప్రభుత్వ పథకం పట్ల గౌరవాన్ని, ఇందిరమ్మ చీరల ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే సర్పంచ్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలంతా ఆత్మగౌరవంతో, ఒకే శోభతో ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని రేవంత్ రెడ్డి పాలనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలమంచి తండ ఉప సర్పంచ్ కోక్య నాయక్, మాజీ ఉప సర్పంచ్ సురేష్ నాయక్, మహిళలు పాల్గొన్నారు.