07-01-2026 12:00:00 AM
గజ్వేల్, జనవరి 6: పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ పార్టీ ఏం సాధించిందో ఇప్పటికైనా చెప్పాలని ఎంపీ రఘునందన్ రావు అ న్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 27వ జాతీయస్థాయి యువ పార్లమెంట్ పోటీలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లా డారు. ఎమ్మెల్సీ కవిత నిండు శాసన మండ లి వేదికగా తెలంగాణలో ఏం సాధించారని దేశంలో పార్టీని పెట్టుకుని పార్టీని మార్చుకుని పోయారని కెసిఆర్‌ను ప్రశ్నించింద న్నారు.
ఆమె ప్రశ్నకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ లలో ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు తెలం గాణ డబ్బులు, కర్ణాటకలో కూడా ఎలా ఇ చ్చారని ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి చనిపోయిన దౌలతాబాద్, చేగుంట రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ సీఎంగా ఉన్న ప్పుడు తమ ప్రశ్నించామని, ఇప్పుడు బిఆర్‌ఎస్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీ సొంత కూ తురే అడుగుతున్నారన్నారు.
కెసిఆర్ దేశం అంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తారన్నారు. రాష్ట్ర శాసన సభలో జరుగుతున్న భాషా సంభాషణను చూస్తే రాజకీయాల్లోకి రావాలను కుంటున్న మేధావులు ఇబ్బంది పడుతున్నారున్నారు. పాలమూరుకు అన్యాయం చేయొద్దని, పదేళ్లు కేసీఆర్ చేయనిది రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. రెండేళ్లయినా అధికారంలోకి వచ్చి పాత బిల్లులు రాలేదని, కొత్త సర్పంచులకు నిధులు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి రావాల్సిన అవసరం లేదుని, కేంద్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తుందన్నారు.
నిజంగా గాంధీ కలలు కన్న పల్లె లు బాగుండాలనుకుంటే కేంద్రం ఇచ్చే నిధు లు కాదు, రాష్ట్ర నిధులు ఎంత ఇస్తారో అంత నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంసిలో ఉన్న 300ల వార్డులను ఎలా విభజించారో తెలియదని, గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల వార్డులను ఎలా కలపాలో ప్రభుత్వానికి తెలి యడం లేదన్నారు. వారికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.