calender_icon.png 8 January, 2026 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదు

07-01-2026 12:00:00 AM

కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు, జనవరి 6 (విజయక్రాంతి): పోరపాట్లు లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ కు సంబంధించి అభ్యంతరాలపై చర్చించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా స్వచ్ఛత ఖచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపుల పై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని, ఫీల్ స్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.