17 June, 2026 | 3:10 AM

కొడవటూర్ గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణలపై విచారణ

17-06-2026 01:58 AM

నకిలీ బిల్లుల వ్యవహారంపై ప్రజావాణిలో ఫిర్యాదు

బచ్చన్నపేట, జూన్ 16 (విజయక్రాంతి): మండలంలోని  కొడవటూర్ గ్రామపంచాయతీ లో. 2012 నుంచి 2021 వరకు జరిగిన అవినీతి అక్రమాలు ఆరోపణలు ఉన్న , నకిలీ బిల్లుల వ్యవహారంపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది.గ్రామపంచాయతీలో జరిగిన అక్రమాలపై పలుమా ర్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, గత ఐదేళ్ల కాలంలో విచారణ నిర్వహించిన కొంతమంది అధికారులు హైకోర్టు, లోకాయుక్తకు తప్పుడు నివేదికలు సమర్పించారని. ఫిర్యాదుదారులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు మరోసారి ఫిర్యాదు చేయగా.ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ అధికారి దేవేందర్, ఇన్చార్జి డీపీఓ వెంకట్రెడ్డి, ఎంపీవో రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వీరస్వామి. సమక్షంలో గ్రామపంచాయతీ రికార్డులు, బిల్లులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు.

సంబంధిత పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, పనుల అమలుకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు .గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఫిర్యాదుదారులు కోరుతున్నారు.