నిధుల దుర్వినియోగంపై విచారణ
- ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు
- డీఎల్‌పీవో యాదయ్య
తూప్రాన్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకట రత్నపూర్ గ్రామ పంచాయతీలో నిధులు దుర్విని యోగం అయ్యాయని కలెక్టర్ కార్యాలయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎల్‌పీవో యాదయ్య, సదరు అధికారులు వెంకటరత్నాపూర్ గ్రామ పంచాయతీని శనివారం సందర్శించారు. ఈ మేరకు దుర్వినియోగపరచిన నిధు ల వివరాలను పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్‌లను అడిగి తెలుసుకుని పరిశీలించారు.
నిధుల వినియోగంలో అవకతవకలు ఏర్పడ్డాయని హెచ్చరిం చారు. బోరుకు సంబంధించిన మోటర్లు మోటార్లకు సంబంధించిన కేబుల్స్, శానిటేషన్‌కు వెచ్చించిన ఖర్చు కొంత మేరకు ఉంటే వాటి బిల్లులను ఎక్కువ చేసి చూపించారు. డీఎల్‌పీవో వాటిని పరిశీలించి సెక్రటరీ, సర్పం చ్, ఉప సర్పంచ్లను హెచ్చరించారు. గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగ పరిచిన దీనిపై జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నోటీసులు ఇస్తామన్నారు. ఇందులో ఏఈ అధికారి, గ్రామ సెక్రెటరీ, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




