calender_icon.png 9 December, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన

09-12-2025 01:20:15 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామాగ్రి పంపిణీ కోసం సమస్త ఏర్పాట్లు చేసి పంపిణీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు పంపిణీ కేంద్రాలను సమగ్రంగా పరిశీలించి పకడ్బందీగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం చేసి నట్లు తెలిపారు.

కాగా మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. పదవ తేదీ ఉదయం నుంచి ఈ సామాగ్రిని పోలింగ్ అధికారులకు అందజేస్తామని ఎంపీడీవో రమాకాంత్ తెలిపారు. కేంద్రాల్లో పోలీసులు సిఐ అజయ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారితో పాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్, ఎం పి ఓ సి హెచ్ రత్నాకర్ రావు, ఎంఈఓ సంధ్య, తదితరులు ఉన్నారు.