13 April, 2026 | 3:30 PM

మ్యాన్ హోల్ మరమ్మతు పనుల పరిశీలన

10-12-2025 02:41 AM

ఉప్పల్ డిసెంబర్ 9విజయక్రాంతి : నాచారం హెచ్‌ఎంటి నగర్ లోని  మ్యాన్ హోల్ మరమ్మత్తు  పనులను  నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పరిశీలించారు. గత కొద్ది కాలంగా  జలమండలి అధికారులు పెద్ద మొత్తంలో మంచినీరు ఒకేసారి వదలడంతో మ్యాన్ హోల్ కూలి పోయి  మురికి నీరు   రోడ్లపై ప్రవహించడంతో  కార్పొరేటర్ శాంతి జలమండి అధి కారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు సేకరించిన అధికారులు  కూలిపోయిన మ్యాన్ హోల్ ప్రాంతాల్లో  కొత్త మ్యాన్ హో లను ఏర్పాటు చేశారు. మ్యాన్ హోల్ ఏర్పాటు పనులను  కార్పొరేటర్ శాంతి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  గత కొంతకాలంగా కూలిపోయిన మ్యాన్ హోల్ లో వల్ల  ప్రమాదాలు జరగడంతోపాటు మురికి నీరు రోడ్లపైకి  వస్తుందని కాలనీవాసులు తమకు ఫిర్యాదు చేయడంతో  అధికా రుల దృష్టికి తీసుకొని వెళ్ళినట్టు ఆమె తెలిపారు. కూలిపోయిన మాన్ హోల్ ప్రాం తంలో  కొత్త మాన్ హోల్ తోపాటు  అన్ని మ్యాన్ హోల్  మరమ్మత్తులను శుభ్రపరచాలని  అధికారులను ఆమె ఆదేశించారు.