calender_icon.png 12 December, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు ప్రశ్నలకు సమాధానమివ్వండి !

10-12-2025 02:39:57 AM

ఈసీని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ 

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: బీజేపీ చేసిన పాపాలను తప్పించేందుకే ఎన్నికల సంఘం(ఈసీ) పనిచేస్తున్నదని, ఒక పథకం ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించకుండా కాపుకాస్తోందని కాంగ్రెస్ సభ్యుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. లోక్‌సభ వేదికగా మంగళవారం మరోసారి ఆయన ఈసీపై విమర్శలు చేశారు. ఈసీ స్వయంప్రతిపత్తి ఎందుకు బలహీనడపడుతున్నదని ప్రశ్నించారు. ‘సర్’పై రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున, ఈసీ ఓటర్ల జాబితా తారుమారు కాదని ఏం భరోసా ఇస్తుందని నిలదీశారు. ఈసీ పరిధిలో నియామకాలు ఎందుకు రాజకీయ ప్రయోజనాలుగా ఉంటున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.