calender_icon.png 12 December, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవ సర్పంచ్‌లో 90 శాతం కాంగ్రెస్ వాళ్లే

10-12-2025 02:42:10 AM

  1. ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్యూచర్ సిటీ 
  2. గ్లోబల్ సమ్మిట్‌తో భారీగా పెట్టుబడులు రావడం సంతోషం
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : ఏకగ్రీవ సర్పంచ్‌ల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే 90 శాతం ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. తన సొంత గ్రామం రహత్‌నగర్‌లో ఎస్టీ అ భ్యర్థి విద్యావంతుడు తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ పరిణామమని అన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీ ఖేల్ ఖతం దుకా ణం బంద్ అవుతుందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం పట్ల సంతృప్తితోనే జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గెలిపిం చారన్నారు.

సన్న బియ్యం మొదలు ఇందిరమ్మ ఇళ్లు వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, గ్లోబల్ సమ్మిట్ తో ఊహించని విధంగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పా రు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం శుభ పరిణామమని, సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. పదేళ్ల విధ్యంసం నుంచి వికాసం వైపు రా ష్ర్టం పయనిస్తోందన్నారు. సకల సదుపాయాలతో ప్యూచర్ సిటీ ఏర్పాటవుతుంద న్నారు. విద్యావంతులు, యువకులు సర్పం చ్‌లుగా ఎన్నిక కావడం మంచి పరిణామని, మెజార్టీగా సర్పంచ్‌లు ఏకగ్రీవం అవుతున్నాయని తెలిపారు.

పదేళ్లలో ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారా..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. బీఆర్‌ఎస్ హయం లో రాష్ర్టం ఆర్థికంగా విధ్వంసమైందని, నీళ్ల, నిధుల పేరిట దోపిడి జరిగిందని విమర్శించారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ నేనని, ఈ విషయంలో బీఆర్‌ఎస్ నేతల మాటలను ప్రజ లు నమ్మే పరిస్థితిలో లేరని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. వా స్తవ పరిస్థితి తెలిసే కేసీఆర్ బయటకు రావడం లేదని చెప్పారు.