16 March, 2026 | 10:01 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

తహసీల్దార్ కార్యాలయాల తనిఖీ

21-09-2024 12:33 AM

తుంగతుర్తి, సెప్టెంబర్ 20: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సమయం పాలన పాటించడం లేదని ‘సార్లు.. సమయానికి రారు’ అనే శీర్షికన విజయక్రాంతిలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు తుంగతుర్తితో పాటు నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలను శుక్రవారం తనిఖీ చేశారు. అధికారులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులను తనిఖీ చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.