13 July, 2026 | 9:05 AM

స్మార్ట్ ఫోన్ రాక.. పెరిగిన సైబర్ నేరాలు

09-06-2024 05:30 PM

వనపర్తి :  స్మార్ట్ ఫోన్  ఉంటే ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే.  ప్రతి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి విషయానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం పరిపాటిగా మారింది. స్మార్ట్ ఫోన్ వాడకం ఎంత  పెరుగుతుందో  అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలను సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా మోసం చేస్తున్నారు. ప్రజలకు అనేక రకాల స్కాముల, ఫ్రాడ్ ల గురించి అవగాహన  ఉండటం లేదు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే మోసాల పట్ల అవగహన కలిగి ఉండాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, స్టేట్మెంట్, లావాదేవీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటా ఉండాలి. ఏదైనా అనుమానస్పద ట్రాన్జక్షన్  ఉంటే వెంటనే  పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. 

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

 సైబర్ క్రైమ్ పట్ల  ప్రజలు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి. కస్టమర్ కేర్ నెంబర్లను  గూగుల్లో అసలు వెతక వద్దు. ఆయా సంస్థలు అధికారక వెబ్సైట్ నుంచి  మాత్రమే కస్టమర్ కేర్ నెంబర్లను పొందాలి. అపరిచిత నెంబర్ నుంచి ఫేస్బుక్ వాట్సప్ ద్వారా  వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు. ఓటిపి,  పాస్వర్డ్,  పిన్ లాంటి వివరణ ఎట్టి పరిస్థితి ఎవరికి షేర్ చేయవద్దు 

 జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల  వివరాలు ఇలా ...

 2023 సంవత్సరంలో 50 కేసులు కాగా  రూ 45 లక్షల 10 వేల 315 నగదు పోగా అందులో నుండి సీజ్ చేసిన నగదు రూ 11 లక్షల 93 వేల 92 కాగా, రికవరీ రూ 3 లక్షల 40 వేల 500, 2024 సంవత్సరంలో 28  కేసులు కాగా  రూ 38 లక్షల 45  వేల 316  నగదు పోగా అందులో నుండి సీజ్ చేసిన నగదు రూ 12 లక్షల 13 వేల 200  కాగా, రికవరీ రూ 56 వేలు అయ్యాయి. 

 సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:  రాందాస్ తేజావత్, అదనపు ఎస్పి వనపర్తి జిల్లా 

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లాటరీలు బహుమతులు వచ్చాయని  ఉద్యోగాలు రుణాలు వంటి సమాచారాన్ని నమ్మి సైబర్ నేరగాల ఉచ్చుకు చిక్కి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తుల నుంచి తమ ఫోన్లకు వచ్చే  క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లింకులపై క్లిక్ చేయడం వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలి. ప్రజల సైబర్ నేరాలకు గురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.