24 August, 2026 | 8:35 AM

చికెన్ దుకాణాల్లో అధికారుల తనిఖీలు

13-11-2024 12:49 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): కూకట్‌పల్లి జోన్ అల్వాల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు చికెన్ షాప్‌లకు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా అల్వాల్‌లోని స్నేహా ఫ్రెష్ చికెన్, నైస్ చికెన్‌తో పాటు మరో రెండు దుకాణాల్లో జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.

ఈ సమయంలో పలు దుకాణాదా రులు నిబంధనలకు విరుద్ధంగా చికెన్ విక్రయాలు చేపడుతున్నట్లు అధికారులు గుర్తిం చారు. ఈ మేరకు ఏడు దుకాణాకు కలిపి రూ.9500 జరిమానా విధించినట్టు జీహెచ్‌ఎంసీ హెల్త్  విభాగం అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లలో నిల్వంచిన 8 కిలోల చికెన్, 4 కిలోల లివర్‌ను స్వాధీనం చేసుకొని టెస్టులకు పంపారు.