calender_icon.png 4 December, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ బరిలో డీఎస్పీ గంగాధర్

13-11-2024 12:48:14 AM

ప్రజాసేవే లక్ష్యంగా ఉద్యోగానికి రాజీనామా

కరీంనగర్, నవంబర్ 12 (విజయక్రాం తి): ప్రజాసేవే లక్ష్యంగా డీఎస్పీ ఉద్యోగాన్ని త్యజించి ఎమ్మెల్సీ బరిలోకి దిగానని, తనను ఆదరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ కోరారు. కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన సర్వీస్‌లో ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకోవడంతోపాటు 200 రివార్డు లు పొందానన్నారు. రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారికి సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నానన్నారు.

ఆదర్శవంతమైన నాయకత్వాన్ని అందించడంతో పాటు యువతను ప్రోత్సహించడానికి కృషి చేస్తానన్నారు. తనను పెద్దల సభలోకి పంపి తే అన్నిరంగాలను అభివృద్ధి చేయడంతోపాటు నిరుద్యో గులకు ఉపాధి, ఉద్యోగులకు పెన్షన్, పీఆర్సీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.