calender_icon.png 20 January, 2026 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలి

20-01-2026 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల, జనవరి 19 (విజయ క్రాంతి): మహిళలు ఆకాశమే హద్దుగా ముం దుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని 1295 ఎస్ హెచ్ జీ లకు దాదాపు రూ.4 కోట్ల 64 లక్షల 68 వేల 771 రూపాయల చెక్కులను వేములవాడ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్, సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇం చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి సో మవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీ నివాస్ మాట్లాడారు.

ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎస్ హెచ్ జీలకు వడ్డీ రుణాలు పంపిణీ చేశామని తెలిపారు.జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ స్వయం సహాయక మహి ళా సంఘాలకు మూడో విడత కింద మొత్తం 1295 ఎస్ హెచ్ జీ లకు దాదాపు రూ.4 కోట్ల 64 లక్షల 68 వేల 771 రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు.

సిరిసిల్ల మున్సిపల్ పరి ధిలో 903 ఎస్ హెచ్ జీలకు రూ. 3 కోట్ల 18 లక్షల 49 వేల 135, వేములవాడ మున్సిపల్ పరిధిలో 392 ఎస్ హెచ్ జీలకు రూ. కోటి 46 లక్షల 19 వేల 636 రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 2023 డిసెంబర్ నుంచి మార్చి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎస్ హెచ్ జీ లు 964లకు రూ.57 లక్షలు, రెండో విడతలో 2024 - 20 25 1236 ఎస్ హెచ్ జీ లకు రూ. 4కోట్ల 6 లక్షల వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని గు ర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ చైర్మన్లు రాజు, స్వరూపారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, శేషాద్రి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.