09-07-2025 12:00:00 AM
శ్రీధరణి ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా ‘MR. సోల్జర్: ఫ్రమ్ మిలిటరీ మాధవరం’. పృథ్వీరాజ్, గోలిసోడా మధు, శ్రీనివాస్ దుంప గల, గోపినాథ్, ఓంకార్, శివం కిరణ్, జూ. రాజనాల, ఈశ్వర్, శ్రీలు, మధుప్రియ, స్వప్నశ్రీ, అది యా, మధుశ్రీ, కనక దుర్గమ్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం ఆగస్టు 2వ వారంలో విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “మిలిటరీ మాధవరం గ్రామాన్ని ఆదర్శంగా చేసుకొని తీసిన సినిమా ఇది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల మంది సైనికులు పాల్గొన్నా రు. పదుల సంఖ్యలో ఆసువులు బాశారు. అయితే, 1970లో మేజర్ రాజు అనే నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్ నిరాధార ఆరోపణలు, అవమానాలను ఎదుర్కొని కుటుంబ సమేతంగా ఆత్మహ త్య చేసుకున్నారు.
ఈ గ్రామ నేపథ్యాన్ని కథాంశంగా తీసుకొని సినిమా నిర్మించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ పీ; డీవోపీ: శ్రీరా మ్; ఆర్ట్: విజయకృష్ణ; నిర్మాతలు: వీఆర్‌ఎం పట్నాయక్, యూఎస్‌ఎన్ పట్నాయక్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీ ముత్యాల.