calender_icon.png 11 July, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూరి సేతుపతి షూటింగ్ షురువైంది

09-07-2025 12:00:00 AM

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుప తి కాంబినేషన్‌లో తొలిసారి కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్మించిన భారీసెట్‌లో విజయ్ సేతుపతి, అందాల భామ సంయుక్తతో పాటు ప్రధాన పాత్రధారులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఛార్మీ కౌర్ సమర్పణలో ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై పూరిజగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో దునియా విజయ్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.