calender_icon.png 20 December, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర సేవల్లో సంజీవని

20-12-2025 12:43:07 AM

  1. ప్రాణదాతలు 108, 102 అంబులెన్స్ లు..

బాలింతలు, గర్భిణులకు, క్షతగాత్రులకు అండగా... 

ఆదిలాబాద్ జిల్లాలో 36 వాహనాల ద్వారా లబ్ధి..

ఆదిలాబాద్, బజార్హత్నూర్ డిసెంబర్ 1౯ (విజయక్రాంతి) :  అత్యవసర వైద్యసేవలు అం దించటంలో 108, 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ఈ వాహనాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆస్పత్రులకు తరలించడంలో 108 వాహనాలు అండగా నిలుస్తున్నాయి, గర్భి ణులు,

బాలింతలను క్రమం తప్పకుండా పీహెచ్‌సీలకు పెద్దా స్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో 102 వాహనాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జిల్లా వ్యాప్తం గా జనవరి నుండి అక్టోబర్ వరకు 17,472 ట్రిప్స్ ,  30,783 బెనిఫిషర్స్ ఈ వాహనాల ద్వారా సేవలు పొందారు. గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స పొందే వారికి సంజీవనిలా ఉప యోగపడుతున్నాయి.

బాలింతలకు, గర్భిణీలకు అండగా....

గర్భిణులు ప్రతినెల వైద్యంతో పాటు ప్రస వ సమయాన ఆస్పత్రులకు వెళ్లటానికి ఇబ్బంది పడేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇతర వాహనాలు సమకూర్చుకొని అవస్థలు పడుతూనే వెళ్లే వారు. కానీ 102 అమ్మ ఒడి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారికి ఇబ్బందులు తప్పాయి. వాహనాల్లో ఆశ కార్యకర్తలు వెంట ఉండి అవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు.

ఈ వాహనంలో అత్యవస ర చికిత్సకు వైద్య కిట్లు, ప్రసవానికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నందు న ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రసవానంతరం కొన్ని నెలల వరకు తల్లీబిడ్డలకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు, ఇతర చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఈ వాహనాల ద్వారా పీహె చ్సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా గర్భిణులు, బాలింతలకు సేవలందుతున్నాయి.

అత్యవసర సమయాల్లో ...

అత్యావసర సమయంలో ఆసుపత్రికి తరలించటంలోనూ ముఖ్య భూమిక ఈ వాహ నాలదే. జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండటంతో తరచూ వాహన ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ సమయాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ వందలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 108 వాహనాలు 24 కొనసా గుతున్నాయి.

ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను 108 వాహ నం ద్వారా తరలిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 26, 695 మందికి అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపడంలో 108 వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

సేవలను సద్వినియోగం చేసుకోవాలి...

ఆదిలాబాద్ జిల్లావాసులు 102, 108 వాహన సేవలను సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మారుమూల గ్రామాలకు వాహ నాల ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, బాలింతలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం.

అత్యవసర సమయంలో వాహనంలోనే ప్రసవం చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఫోన్ చేసిన పావు గంట లోపే ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. కొందరు అత్యవసరమైన పని లేకున్న108 వాహనాలకు ఫోన్ చేసి తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాంటివారు అనవసరంగా ఫోన్ కాల్ చేయవద్దని సూచించారు.

 సామ్రాట్, 108, 102 వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్