నర్సింహులగూడెం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు
10-08-2026 12:00 AM
ప్రారంభించిన రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి
కూసుమంచి, ఆగస్టు 9(విజయక్రాంతి): కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సర్పంచ్ సరితా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు గ్రామాభివృద్ధికి తోడ్పడతాయని,
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీస్ తో సమానం అని, గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు దొంగతనాలు జరక్కుండా సీసీ కెమెరా తోడ్పాటు ఉంటుందని తెలిపారు. అనంతరం దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంజీవ్, ఎస్త్స్ర నాగరాజు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు






