10 August, 2026 | 5:02 AM

నేలకొండపల్లిలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

10-08-2026 12:00 AM

నేలకొండపల్లి, ఆగస్టు 9(విజయక్రాంతి): నేలకొండపల్లి మండల కేంద్రంలోని పోట్టి శ్రీరాములు సెంటర్ లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు...ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు హాజరై జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు...

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు,బి బ్లాక్ అధ్యక్షులు జెర్రీపోతుల సత్యనారాయణ, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడవల్లి నాగరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగూరి వాసవి, సర్పంచ్ బోయిన వేణు,దోసపాటి శేఖర్, వంగవీటి నాగేశ్వరరావు, మైసా శంకర్, రెడ్డిమళ్ళ బాబు రెడ్డి, నల్లాని మల్లిఖార్జున్ రావు, పసుపులేటి ఉపేందర్, కాసాని లింగయ్య, కైలాసపు వెంకటేశ్వర్లు, బోయిన నరసింహారావు,కుక్కల ఆదాం  పాల్గొన్నారు.