ఓపెన్ టెన్త్ ఇంటర్ ఫలితాలు విడుదల
మీ సేవ ద్వారామెమోల అందజేత
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డైరెక్టర్ నవీన్ నికోలస్, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి, ఆర్జేడీ సోమిరెడ్డి కలిసి ఫలి తాలను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీలో 36,863 మంది పరీక్షలు రాయగా 26,542 (72 శాతం) మంది పాస్ అయ్యారు. ఇంటర్‌లో 54,679 మందికిగానూ 37,562 (68.70 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు డైరెక్టర్ తెలిపారు. టెన్త్ ఫలితాల్లో పురుషులు 66.41 శాతం ఉత్తీర్ణత సాధిస్తే మహిళలలు 77.88 శాతం మంది అర్హత సాధించా రు. ఇంటర్‌లో పురుషులు 63.90 శాతం, మహిళలు 73.76 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
టెన్త్ ఫలితాల్లో వనపర్తి జిల్లా, ఇంటర్‌లో మలుగు జిల్లాలు టాప్‌లో నిలిచాయి. ఈ మెమోలను మీ సేవా ద్వారా అందిచనున్నట్లు నవీన్ నికోలస్ తెలిపారు.






