calender_icon.png 18 July, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాపై దాడులు తీవ్రతరం చేయండి!

16-07-2025 12:00:00 AM

జెలెన్ స్కీకి ట్రంప్ సూచన

న్యూయార్క్, జూలై 15: ఉక్రెయిన్‌పై 50 రోజుల్లోగా యుద్ధం ఆపాల ని లేకుంటే సుంకాల విషయంలో తీ వ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వ స్తుందని అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ రష్యాను హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రష్యా రాజధాని మాస్కోపై దాడులు తీవ్రతరం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షు డు జెలెన్ స్కీకి ట్రంప్ సూచించినట్టు వార్తలు రావడం సంచలనం కలిగిస్తోంది.

ముఖ్యంగా మాస్కోపై దాడు లకు తాము సరఫరా చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలతో విరుచుకుపడాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్, జెలెన్ స్కీ మధ్య ఈ సంభాషణ జూలై 4వ తేదీనే జరిగినట్టు స మాచారం. ఇదే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపడానికి పుతిన్ నిరాకరించడంపై ట్రంప్ బాహటంగానే అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే వరుసగా రష్యాపై కఠిన ఆంక్షలతో కూడిన నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేసే దే శాలపై 500 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపా రు. తాజాగా యుద్ధం ఆపకుంటే ర ష్యాపై 100 శాతం పైగా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.