16-07-2025 12:00:00 AM
జూలియస్ బేర్ వార్షిక నివేదిక విడుదల
న్యూఢిల్లీ, జూలై 15: ప్రపంచంలో నే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. మంగళవారం జూ లియస్ బేర్ ఖరీదైన నగరాలకు సం బంధించి వార్షిక నివేదికను విడుదల చేసింది. వరుసగా మూడో ఏడా ది సింగపూర్ ఖరీదైన నగరాల్లో తొలి స్థానంలో నిలవడం విశేషం. మరోవైపు గతేడాది రెండో స్థానంలో ఉన్న హాంకాంగ్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించగా..
హాంకాంగ్ మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా షాం ఘై, మొనాకో, జురిచ్, న్యూయార్క్, పారిస్, సావో పౌలో, మిలన్ ఉన్నా యి. కనీసం 1 మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్న వివిధ రకాల ఉ త్పత్తులు, వారు అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా జీవన వ్యయాన్ని విశ్లేషించిన జూలియస్ బేర్ తమ నివేదికను తయారు చేసింది. ఈ ఏ డాది ఫిబ్రవరి మధ్య డేటా ను పరిగణలోకి తీసుకుంది.