calender_icon.png 18 January, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ షెడ్యూల్ కోసం పెద్ది కరసత్తులు

18-01-2026 12:19:54 AM

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’.  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. చికిరి పాటతో ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ సినిమా నుంచి త్వరలోనే మరో గీతాన్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక చిత్రీకరణ విషయానికొస్తే.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

త్వరలోనే భారీ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన స్టిల్స్‌లో రామ్‌చరణ్ బీస్ట్ మోడ్‌లో కనిపించడం అభిమానులను ఆనందానికి గురిచేసింది. రాక్ సాలిడ్ మసిల్స్, ఇంటెన్స్‌గా కనిపించిన ఈ లుక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. మార్చి 27న పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.