7 March, 2026 | 4:29 PM

Breaking News

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి   •   ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •  

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ

07-03-2026 01:34 PM

హైదరాబాద్: అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్(Delaware Governor Matt Meyer) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మాట్ మేయర్ రేవంత్ రెడ్డికి వివరించారు.

భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని మాట్ మేయర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ డెలావర్ గవర్నర్ కి 'తెలంగాణ-2047' విజన్(Telangana-Rising-2047) డాక్యుమెంట్ ను అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.