calender_icon.png 18 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి ఇద్దరు భామలతో..

18-01-2026 12:07:00 AM

స్టార్ హీరోయిన్‌గా కెరీర్‌లో దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. సంక్రాంతి హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న పొందిన యువ కథానాయకి మీనాక్షి చౌదరి. అటు దర్శకుడిగా, ఇటు హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్నాడు తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్. ఈ ముగ్గురూ కలిసి తెరపై సందడి చేస్తే చూసేందుకు ఇష్టపడనివారెవరూ?! ఔను, ఈ కాంబోలో సరికొత్త సినిమా రూపొందుతోంది. ‘కోమలి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనన ప్రదీప్ ఆ తర్వాత కథానాయకుడిగా మారాడు. ‘లవ్ టుడే’ చిత్రంతో 2022లో మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ ఆ తర్వాత ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలతో దక్షిణాదిన తన సత్తా చాటాడు.

ముఖ్యంగా ఇటీవల ‘డ్యూడ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రదీప్ తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్నాడు. అలాంటి హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మళ్లీ తన స్వీయ దర్శకత్వంలో మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారట. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను కూడా ఫైనల్ చేసినట్లు తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి లాంటి అందాల తారలతో కొత్త సినిమా చేయబోతున్నాడట ప్రదీప్. ఈ సినిమా సైంటిఫిక్, లవ్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుందని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నారట.