అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
వరంగల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరి నిందితులను వరంగల్ సిసిఎస్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు..పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు 15 లక్షల 20 వేల రూపాయల విలువగల 95గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ జి.బాల స్వామి, క్రైమ్ ఏసీపీ పి.సదయ్య, హన్మకొండ ఏసీపీ పి.నర్సింహరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ లు ఏ . రాఘవేందర్, కె .రామకృష్ణ , హన్మకొండ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సుబేదారీ ఇన్స్పెక్టర్ రంజిత్, హన్మకొండ ఎస్ ఐ కిశోర్, ఏఏఓ సల్మాన్ పాషా, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్లు మహేశ్, జంపయ్య, కానిస్టేబుల్లు మధుకర్, చంద్రశేఖర్, హన్మంతు, ఐ టీ కోర్ కానిస్టేబుల్ నగేష్, కేయూ, హన్మకొండ క్రైమ్ కానిస్టేబుళ్లు జితేందర్, రమణ లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్
తాళం వేసిన ఇళ్లల్లో చోరిలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి నుండి పోలీసులు కుమారు పది లక్షల రూపాయల విలువ గల 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్య ప్రదర్శించి ప్రాపర్టీ రికవరీ చేసిన హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ ఐ పరశురాములు, క్రైమ్ పార్టీ అశోక్, రవుఫ్ లను సీపీ అభినందించారు.




