5 June, 2026 | 1:09 AM

అంతర్రాష్ట్ర వాహనాల దొంగ అరెస్ట్

05-06-2026 12:00 AM

నాలుగు బైకులు స్వాధీనం

శంషాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): అంతర్రాష్ట్ర స్థాయిలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు విశ్వకర్మ మోహ న్ కుమార్ (32)ను ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జీఐఏ స్టేషన్ ఆఫీసర్ బి. సంజీవ్ ఆధ్వర్యంలో, డీఐ పవన్ కుమార్ పర్యవేక్షణలో హెచ్సీ శ్రీకాంత్, కానిస్టేబుళ్లు జావీద్, సిద్ధేశ్వరిలు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. ఇతడి అరెస్టుతో ఆర్జీఐఏ, రాయచూర్, కర్నూలు, ఆదోని పరిధిలోని 4 చోరీ కేసులు ఛేదించబడ్డాయి.

నిందితుడి నుంచి రూ. 8 లక్షల విలువైన 3 రాయల్ ఎన్ఫీల్డ్, 1 పల్సర్ బైక్ల ను స్వాధీనం చేసుకుని, కోర్టు ద్వారా రిమాం డ్కు తరలించారు. వాహనదారులు తమ బైక్లకు హ్యాండిల్ లాక్తో పాటు అదనపు లాకులు వేసుకోవాలని, వాహనాలను సీసీ కెమెరాల నిఘాలో పార్క్ చేయాలని, అనుమానితులు కనిపిస్తే ’డయల్ 100’కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.