11-11-2025 04:38:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): టిజిపేట ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నని మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడల పట్ల ఆసక్తి పెంచాలని సూచించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పైన డీఈఓతో మాట్లాడడం జరిగింది కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడం జరిగింది.
ఇందులో టిజిపేట అధ్యక్షులు నరాల సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, అలాగే భూక్య రమేష్ భోజన్న ఎస్టియు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ వ్యాయామ ఉపాధ్యాయులు వంశీ సంధ్య సంజీవ్ బుచ్చి రామారావు తదితరులు పాల్గొన్నారు డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తానని తెలియపరిచారు.