11-11-2025 04:41:13 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ లకు నిరసిస్తూ పెద్దపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ దుగ్యల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు బిజెపి పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్ మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన అనేది ఢిల్లీ, భారత దేశ ప్రజలను తీవ్ర దిగ్ర్బిందికిలోన్ చేసినదని, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగడ సాంభూతిని తెలియజేస్తున్నమన్నారు.
గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని మేము బిజెపి నుండి ప్రార్థిస్తున్నమని, సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన భారీ పేలుడు ఘటనకు కారకులు ఉగ్రవాదులే భారతదేశంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న సేవలకు గాను ప్రజలలో బిజెపి ప్రభుత్వానికి మోడీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అలాగే ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీర్ణించుకోలేని ఉగ్రవాదులు మోడీ వ్యతిరేకులు ఈ కుట్రకు పన్నాగం పన్నారని, ఈ బ్లాస్టులో వాడిన కారును, చేతులు మారుతూ చివరికి బాంబ్ బ్లాస్ట్ అయ్యే వరకు చేతులు మారిన ప్రతి ఒక్కరు కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తులేనని, మోడీ ప్రభుత్వాన్ని ఉగ్రవాద దేశాలు ఉగ్రవాదులు ఒకటైన ఈ మోడీ నేతృత్వంలోని భారతదేశాన్ని ఏం చేయలేరని ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శిలారపు పర్వతాలు, తంగేడ రాజేశ్వరరావు, పోల్సని సంపత్ రావు, ఈర్ల శంకర్, వొళ్లే తిరుపతి, మేకల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్, రాజం మహాంతకృష్ణ, ఎర్రోల్లా శ్రీకాంత్, పురెళ్ల రాజేశం, ఉప్పు కిరణ్, ముంజ రాజేంద్రప్రసాద్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శి గుడ్ల సతీష్, బోలవేనా సురేందర్, మామిడి ఉమేష్ ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్, సబ్బు మల్లయ్య, శివయ్య, కార్యదర్శులు పోగుల రాజు, శ్రీధర్ శిలారపు మహేష్, పడాల శ్రీనివాస్, మధుకరణ్, అంజి, వంశీ కుమార్, లక్కీ వినయ్, వంశీ, అజయ్ సిద్దు రమేష్ అనుదీప్ శేఖర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.