11-11-2025 04:34:46 PM
స్వల్ప గాయాలతో సురక్షితం
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ కారుకు మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి గజ్వేల్‌లోని తన కార్యాలయానికి వస్తున్న తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారు, ఉదయం 11 గంటల ప్రాంతంలో కోహెడ మండలం శంకర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. తహసీల్దార్ శ్రవణ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. తహసిల్దార్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.