calender_icon.png 10 August, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ రేట్లు యథాతథం

07-08-2025 01:14:01 AM

  1. 5.5 శాతం వద్దే రెపోరేట్

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి

ముంబై, ఆగస్టు 6: ట్రంప్ టారిప్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యం లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్న ట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 5.5 శాతం వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీపీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి రెపోరేటును తగ్గించకపోవడంతో వడ్డీ రేట్లలో ఎ లాంటి మార్పులు లేవన్నారు.

ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ, అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితులు ఇంకా తొలగలేదని ఆర్‌బీఐ గవర్నర్  తెలిపారు. అలాగే స్థిర విధాన వైఖరిని కమిటీ మరింతకాలం కొనసాగించనున్నట్లు  పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, జూన్‌లో  50 బేసిస్ పాయింట్లకు కోత పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు రెపోరేటో ఒక శాతం వరకు దిగొచ్చింది.

ప్రస్తుత ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2025  ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 3.1 శాతానికి దిగి రావచ్చని అంచనా వేసినట్లు ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. కరెంట్ ఖాతా లోటు స్థిరంగా ఉండే అవకాశమందని, ద్రవ్యలభ్యత మిగులు స్థాయిలోనే ఉం దని గవర్నర్ పేర్కొన్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా నమోద కావచ్చని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముం దుకు వెళుతోందని, ధరల స్థిరీకరణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. బ్యాంక్ లాక ర్లలో ఉంచిన వస్తువులు, ఖాతాలకు సం బంధించిన క్లెయిమ్ పరిష్కారాన్ని ఆర్‌బీఐ ప్రా మాణీరించనుందని గవర్నర్ వివరించారు. దేశంలో వర్షపాతం అధికంగా నమోదు అవుతుండడంతో ద్రవ్యోల్బణం తగ్గనుందని ఆయన పేర్కొన్నారు. 

ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’పై కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ‘డెడ్ ఎకానమీ’ అం టూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మ ల్హోత్రా స్పందించారు. దేశ ఆర్థిక వ్య వస్థ బలంగా ఉందని, ప్రపంచ వృ ద్ధికి అమెరికా కన్నా భారత్ ఎక్కువ గా దోహదం చేస్తోందని స్పష్టం చేశా రు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకారం ప్రపంచ వృద్ధి 3 శాతంగా ఉంటే.. భారత్ వృద్ధి అం చనాలు మాత్రం 6.5 శాతంగా ఉన్నాయన్నారు.

భారత్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రస్తుతం అంచనా వేయడం కష్టమేనన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మాత్రం వృద్ధిపై ప్రభా వం చూపే అవకాశముందన్నారు. మనం ప్రతీకార సుంకాలు విధిస్తే తప్పే మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్ర భావం ఉండదని తెలిపారు.