17 August, 2026 | 11:45 PM

31 వరకు ఇంటర్ ఫేజ్2 అడ్మిషన్లు

01-07-2026 12:04 AM

షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు

Telangana Inter Phase 2 Admissions 2026 కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. SSC supplementary exams పూర్తి చేసిన విద్యార్థులు జూలై 31 వరకు ఇంటర్ అడ్మిషన్లు పొందవచ్చు.

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): రెండో విడత ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసిం ది. ఈనెల 31 వరకు ఈ విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్ షెడ్యూల్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపిం ది. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు బో ర్డు సూచించింది. 

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. విద్యార్థులు గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫేజ్-2 అడ్మిషన్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్, అవసరమైన పత్రాలు, కాలేజీ ఎంపిక విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

FAQ's

Q1: ఇంటర్ ఫేజ్-2 అడ్మిషన్ల చివరి తేదీ ఎప్పుడు?

A: ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 31 వరకు అడ్మిషన్లు కొనసాగనున్నాయి.

Q2: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చా?

A: అవును. సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత వారికి కూడా అవకాశం కల్పించారు.

Q3: ఏ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోవాలి?

A: ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలి.

Related Articles

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
నేటి నుంచి విద్యార్థుల వాట్సాప్‌కు ఇంటర్ హాల్‌టికెట్ ప్రివ్యూ
నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
మైనార్టీ కళాశాల ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రారంభం
టీజీడబ్ల్యూఆర్‌సీలో ఇంటర్ ప్రవేశాలు