calender_icon.png 3 January, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఇంటర్ హాల్‌టికెట్ ప్రివ్యూ

03-01-2026 12:31:52 AM

వివరాలను చెక్‌చేసుకునే చాన్స్

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : నేటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్ ప్రివ్యూ (వివరాలు)ను పంపించనున్నారు. ఈ మేర కు శుక్రవారం ఇంటర్ బోర్డు ఒక ప్రటనను విడుదల చేసింది. విద్యార్థి వివరాలు కరెక్టేనా లేదా అని సరిచూసుకునేలా సమాచారం పంపించనున్నారు.

విద్యార్థి పేరు, సబ్జెక్టు, గ్రూపు, మీడియం, సెకండ్ లాంగ్వేజ్ తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకుని, ఏమైనా తప్పులుంటే కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు చెప్పాలని అధికారులు తెలిపారు.

హాల్‌టికెట్ నెంబర్, సెంటర్ వివరాలు ఇప్పుడే చెప్పబోమన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి, వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ఫస్టియర్ వాళ్లకు, ఫిబ్రవరి 26 నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు.