calender_icon.png 24 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ కళాశాల, ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

24-01-2026 12:00:00 AM

ఎల్లారెడ్డి, జనవరి 23 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నందు 2026 -2027వ సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం CEC మరియు mec గ్రూప్ నందు అడ్మిషన్ల ప్రక్రియ మరియు కరపత్రమును గౌరవ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం మైనారిటీ గురుకులాల ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఉచిత విద్య, నాణ్యమైన భోజనం ఇతర సౌకర్యాలు కల్పిస్తుందని కావున తల్లిదండ్రులు అందరూ తమ యొక్క పిల్లలను మైనార్టీ పాఠశాల మరియు మైనార్టీ కళాశాల యందు అడ్మిషన్లు కల్పించి వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిందిగా తెలియజేశారు.

ఈ కార్యక్రమం నందు పట్టణ మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ షరీఫ్, మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫాత్  పట్టణ మైనారిటీ సదర్ సాబ్ షేక్ గయాజుద్దీన్ పట్టణ మైనార్టీ నాయకులు మహమ్మద్ షెకావత్ అలీ, సయ్యద్ గఫార్,మహమ్మద్ అబ్దుల్ రఫిక్,  షేక్ ముజీబుద్దిన్, సయ్యద్ నజీబుల్లా, కళాశాల, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు