నిరుపేదలకు చెక్కుల పంపిణీ
మొయినాబాద్ ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) పథకాలు నిరుపేదల జీవితాల్లో ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.గురువారం మొయినాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, మున్సిపల్ మరియు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేశారు.
సీఎం సహాయనిధి ద్వారా 40 మంది లబ్ధిదారులకు రూ.18.38 లక్షల విలువైన చెక్కులు, అలాగే 23 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.23 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఆడబిడ్డల వివాహం గౌరవప్రదంగా జరగేందుకు ఈ పథకాలు బలమైన అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఆరోగ్య సమస్యల సమయంలో సీఎం సహాయనిధి పెద్ద భరోసాగా మారుతుందని చెప్పారు.ప్రతి నిరుపేద కుటుంబానికి అవసరమైన సమయంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇలాంటి సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, తహసీల్దార్ గౌతమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




