04-12-2025 12:00:00 AM
హెలెన్ కిల్లర్ ఇనిస్టిట్యూషన్‌లో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): హెలెన్ కిల్లర్ ఇనిస్టిట్యూషన్ ఆర్కేపురంలో అంతర్జాతీయ దివ్యాంగు ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. బదిలీ విద్యార్థులు, మానసిక దివ్యాం గుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వివిధ రకాలైన ఆటలు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమ తులు అందజేశారు.
ముఖ్యఅతిథి ఉమర్‌ఖాన్ మాట్లాడు తూ.. దివ్యాంగులు అన్ని రంగాల్లో సంపూర్ణ భాగస్వామ్యం కావాలని, వారి హక్కులు, అవకాశాలు, గౌరవం పొందేలా కృషి చేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి ఆర్ముగం, అంజయ్య, శశిధర్, శ్రీధర్, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొ ని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.