04-12-2025 12:00:00 AM
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి
సూర్యాపేట, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని దాస్తండా గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అనుచరులతో కలిసి నునావత్ బాలు ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారికి మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ రెండు సంవత్సరాల్లో చేసి చూపిందన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో నునావత్ లింగయ్య, ధరవత్ రాంబాబు, మేఘావత్ శంకర్, రణావత్ ఆశోక్, ధరావత్ నీలమ్మ, ధరావత్ రజిత, నేనావత్ బీబీ, ధరావత్ పఠానీలతో పాటు మొత్తం సుమారు 100 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.