13 May, 2026 | 7:42 AM

యోగా చేయడం అలవాటుగా మార్చుకోవాలి

21-06-2024 10:21 AM

ఆదిలాబాద్, (విజయ క్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ లోని  రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,  శాసన సభ్యులు పాయల్ శంకర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువులు వారిచే యోగ ఆసనాలు వేయించారు. అటు ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం యోగా చేయడం అలవాటుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.